స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్
ఎన్ని లక్షల కోట్లు అయితే సరిపోతాయి సర్?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన మూడేళ్లు ముగియకముందే అవినీతిపై ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి. ఏ శాఖలో చూసినా డబ్బులు తప్ప, మన డ్యూటీ మనం చేశామా అనే ఆలోచన ఏ ఒక్క ఉద్యోగికి లేదు. అందులో సీఎం నిర్వహించే శాఖలో కొట్టొచ్చినట్లు అనేకం కనిపిస్తున్నాయి. హెల్ప్ చేసిన వాళ్లకు దోచిపెడుతున్న సంఘటనలు చూస్తే ఇదేం పాలన, ఈ కాంగ్రెస్ ఉంటే ఎంత, ఊడితే ఎంత అన్నట్లుగా ప్రజాస్వామ్య వాదులకు అనిపిస్తోంది.
మెడికోవర్ మీది కాదా?
కేసీఆర్ ప్రారంభించారు. కిషన్ రెడ్డి ఓపెనింగ్ చేశారు. నేను ప్రారంభిస్తే నాది అవుతుందా అని రేవంత్ రెడ్డి ప్రకటించారు. కానీ, అందులో డైరెక్టర్స్ మెడికల్ మాఫియాకు నిదర్శనం. ఆనాడు కేసీఆర్ సొంత కులానికి దోచిపెట్టేలా ఒక్క యశోదనే బతికేలా చేసి 300 శాతం లాభాలకు తీసుకొచ్చారు. దాన్ని ఫారెన్ కంపెనీలకు అమ్ముకుని వైట్ చేసుకున్నారు.
