తెలంగాణ

అసైన్డ్ భూమిని ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకున్నావ్ హరీశ్ రావు : మంత్రి పొంగులేటి

రాష్ట్రంలో 22ఏపై విమర్శలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఈ అంశం మీద అసెంబ్లీలో క్లారిటీ ఇచ్చేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధపడింది. ఈ క్రమంలోనే రెవెన్యూ, గృహ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సభలో సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. సెషన్స్ ప్రారంభానికి ముందు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావుపై మంత్రి మరోసారి ఘాటు విమర్శలు చేశారు. గత ప్రభుత్వంలో హరీశ్‌రావు భారీ భూ దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. తన మామ భూములకు నాటి కాంగ్రెస్ ప్రభుత్వమే ఎన్ఓసీ ఇచ్చిందన్న మాజీ మంత్రి వ్యాఖ్యలకు మంత్రి పొంగులేటి కౌంటర్ ఇచ్చారు. అసైన్డ్ భూములకు ఏ ప్రభుత్వం అనుమతి ఇచ్చినా అది తప్పే అవుతుందని.. ఆ విషయం హరీశ్ రావుకు తెలియదా? అని ప్రశ్నించారు.