International

HouthiDroneAttack: మక్కాపై డ్రోన్ దాడికి యత్నం.. ఇస్లామిక్ దేశాల్లో అలజడి!

సౌదీ అరేబియాలోని అత్యంత పవిత్రమైన మక్కా నగరాన్ని లక్ష్యంగా చేసుకుని యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు ప్రయోగించిన డ్రోన్‌ను సౌదీ నేతృత్వంలోని కూటమి బలగాలు విజయవంతంగా అడ్డుకుని నాశనం చేశాయి. మంగళవారం సాయంత్రం మక్కా ఆకాశంలోకి ప్రవేశించే ముందే సౌదీ అరేబియా రాయల్ ఎయిర్ డిఫెన్స్ ఫోర్స్ ఈ డ్రోన్‌ను గాలిలోనే పేల్చివేసింది. ఈ దాడి యత్నం మక్కా నగర భద్రతకు తీవ్ర ముప్పు కలిగించేలా ఉందంటూ సౌదీ నేతృత్వంలోని కూటమి ప్రతినిధి తుర్కి అల్-మాలికీ తీవ్రంగా ఖండించారు.