హౌతీల విధ్వంసం.. సౌదీ ఎయిర్ పోర్టులో భారీ పేలుడు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, వరుస దాడుల నేపథ్యంలో ఇరాన్ సైతం దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గకపోవడంతో మిడిల్ ఈస్టులోని గల్ఫ్ కంట్రీస్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. అమెరికా ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతుంటే.. ఇరాన్ దాని మద్దతు దారులైన హౌతీ తీవ్రదారులు యూఎస్ మిత్రదేశాలపైన సౌదీ అరేబియా మీద విరుచుకుపడుతోంది. తాజాగా ముందస్తు హెచ్చరికలు జారీ చేసి మరీ హౌతీ రెబల్స్ సౌదీ అరేబియాలోని ఓ విమానాశ్రయం మీద భారీగా దాడులు చేసినట్టు సమాచారం. హౌతీల దాడులకు రియాద్ విమానాశ్రయం సమీపంలో భారీ పేలుడు సంభవించింది.సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో వైమానిక దాడి హెచ్చరికల తర్వాత కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ఇంధన డిపోలో భారీగా మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగసిపడటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.
