క్రైమ్

మెదక్‌లో ఘోరం.. తల్లి కోసం కొడుకు దారుణం

రాష్ట్రంలో మరో దారుణం చోటుచేసుకుంది. తల్లి కోసం ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. తల్లి లేదని తెలిసి ఒంటరిగా ఫీలయిన యువకుడు ఈ దారుణానికి పాల్పడినట్టు తెలుస్తోంది . మెదక్ జిల్లా పెద్ద శంకరంపేటలో ఈ ఘటన చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. తల్లి మరణాన్ని తట్టుకోలేక 19 ఏళ్ల ఆమె కుమారుడు ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసింది. వివరాల్లోకివెళితే.. పెద్దశంకరం పేటకు చెందిన బేతమ్మ(45) బతుకుదెరువు కోసం కొన్నేళ్ల క్రితం భర్తతో కలిసి హైదరాబాద్ వెళ్లింది.అక్కడ వీరు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్టు సమాచారం. అయితే, నిన్న భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో తీవ్ర మనస్తాపానికి గురైన బేతమ్మ హైదరాబాద్‌లో తను ఉంటున్న ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసింది. ఈ విషయం తెలిసి కొడుకు సైతం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.