క్రైమ్
హైదరాబాద్లో ఘోరం.. గోనె సంచిలో యువతి బాడీ!
హైదరాబాద్ మహానగరంలో మరో భయానక ఘటన వెలుగుచూసింది. ఓ ఇంట్లోని గోనె సంచిలో యువతి మృతదేహం లభ్యమైంది. పక్కింట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు వెళ్లి చూడగా.. సంచి మూటకట్టి ఉండటాన్ని గమనించారు. దాని మీద రక్తపు మరకలు ఉండటంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడకు చేరుకుని పరిశీలించగా.. గోనె సంచిలో యువతి మృతదేహం కనిపించడంతో అంతా షాక్ అయ్యారు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో ప్రియురాలిని ప్రియుడే దారుణంగా హత్య చసి గోనె సంచిలో మూటగట్టి అక్కడి నుంచి పరార్ అయినట్టు సమాచారం.
