తెలంగాణ

TG : గురుకులంలో ఘోరం.. బాలికలను బాత్రూంలోకి తీసుకెళ్లి!

రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో మైనర్ బాలికలపై అఘాయిత్యాలు పెరుగుతూనే ఉన్నాయి. వారిని కంటికి రెప్పలా కాపాడాల్సిన వారే వారిమీద కన్నేస్తున్నారు. టీచర్లు, వార్డెన్ల ముసుగులో ఎక్కడపడితే అక్కడ టచ్ చేస్తూ వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు కథనాలు వస్తూనే ఉన్నాయి. తాజాగా నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలలో చదువుతున్న మైనర్ బాలికలతో అక్కడే విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికుడు అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్టు సమాచారం. వారిని బాత్రూమ్‌లోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్టు బాలికలు ఆరోపించారు. తమను అసభ్యకరంగా తాకుతున్నాడని చిన్నారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని నిడమనూరు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పారిశుద్ధ్య కార్మికుడు తమను తాకరాని చోట తాకుతున్నాడని, బాత్రూమ్‌లోకి తీసుకెళ్లి డోర్ వేస్తున్నాడని చిన్నారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.