క్రైమ్
అమెరికాలో ఘోర రోడ్డుప్రమాదం.. తెలంగాణ యువతి మృతి!
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఓ యువతి దుర్మరణం చెందింది. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలానికి చెందిన దారం సుప్రియ(31) ఉద్యోగరీత్యా అమెరికాలోని మిస్సోరిలో నివాసముంటోంది. ఆమె కారులో ప్రయాణిస్తుండగా వేగంగా వచ్చిన ఓ ట్రక్కు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో సుప్రియ తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆమెతో పాటు ప్రయాణిస్తున్న మరొక భారతీయ యువతికి తీవ్ర గాయాలయ్యాయి.
