క్రైమ్
సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి దుర్మరణం
రాష్ట్రంలో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సూర్యాపేట జిల్లాలో తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు.కోదాడ మండలం దుర్గాపురం స్టేజ్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు సమాచారం. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే జాతీయ రహదారిపై కంటైనర్ లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో ప్రైవేట్ ట్రావెట్స్ బస్సు వెనుకనుంచి ఢీ కొట్టినట్టు తెలుస్తోంది. ఆ సమయంలో బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉండగా.. ఇప్పటివరకు 6 మంది మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నట్టు సమాచారం. మరో 22 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయినట్టు తెలుస్తోంది. నిద్రమత్తులో ఉండగానే పలువురు ప్రయాణికులు మృతి చెందినట్టు తెలుస్తోంది.
