క్రైమ్
సిద్దిపేటలో దసరా నాడు దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్!
సిద్దిపేట జిల్లాలో బాలికపై సామూహిక అత్యాచారం జరిగిన విషయం ప్రస్తుతం సంచనంగా మారింది. వివరాల్లోకివెళితే.. సిద్ధిపేట జిల్లా ధూల్మిట్ట మండలంలో బాధిత బాలిక తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటోంది. ఆమె పేరెంట్స్ పొలం పనులకు వెళ్లిన సమయంలో స్థానికంగా ఉండే కొందరు వ్యక్తులు.. బాలిక ఆడుకుంటుండగా ఆమెకు మాయమాటలు చెప్పినట్టు తీసుకెళ్లినట్టు సమాచారం. సమీపంలోని మరో గ్రామానికి తీసుకెళ్లి బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు తెలిసింది. మరుసటి రోజు ఉదయం బాలికను సొంత గ్రామానికి తీసుకొచ్చి వదిలేసి నిందితులు అక్కడి నుంచి పరార్ అయ్యారు. అయితే, రాత్రంతా ఎక్కడుందని తల్లిదండ్రులు ఆరా తీయగా తనపై చేర్యాల పట్టణం, ధూల్మిట్ట గ్రామానికి చెందిన ఏడుగురు అత్యాచారానికి పాల్పడ్డారని బాలిక వెల్లడించింది.
