క్రైమ్
హైదరాబాద్‌లో దారుణం.. శునకంపై లైంగికదాడి!
నేటి సమాజంలో మనుషులకే కాదు వీధి కుక్కులకు కూడా సేఫ్టీ లేకుండా పోయింది. మహిళలు, మైనర్లపై లైంగికదాడుల ఘటనలు పెరిగిపోతూనే ఉన్న క్రమంలో తాజాగా జంతువులపై కొందరు కామాంధులు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తమ లైంగికవాంఛను తీర్చుకోవడానికి సమాజం అసహ్యించుకునే పనులకు పూనుకుంటున్నారు. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కొంపల్లిలోని సాయినగర్‌లోని మెఫెయిర్ లగ్జరీ అపార్ట్‌మెంట్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న సంజయ్ తివారీ (50) అనే వ్యక్తి వీధి శునకంపై లైంగికదాడికి పాల్పడినట్టు సమాచారం .ఈ నెల 8వ తేదీన అపార్ట్‌మెంట్ ఆవరణలో తిరిగే ఒక ఆడ కుక్కను శాలువలో బంధించి తన సెక్యూరిటీ క్యాబిన్‌లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్టు తెలిసింది.సీసీ ఫుటేజీలో ఆ దృశ్యాలు రికార్డు అయినట్టు తెలుస్తోంది.
