హన్మకొండలో దారుణం.. రెండ్రోజులుగా కారు డిక్కీలోనే డెడ్ బాడీ!
రాష్ట్రంలో మరో దారుణ ఘటన కలకలం రేపింది.కారు డిక్కీలో ఓ యువతి మృతదేహం లభ్యమైంది.రెండ్రోజులుగా కారు అక్కడే ఉండటాన్ని గుర్తించిన స్థానికులు.. డిక్కీలో నుంచి దుర్వాసన రావడాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు.వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు డిక్కీ తెరిచి చూడగా...అందులో కుళ్లినస్థితికి చేరుకున్న ఓ యువతి డెడ్ బాడీ కనిపించడంతో అంతా షాక్ అయ్యారు. ఈ ఘటన హన్మకొండ జిల్లాలో శుక్రవారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. జిల్లాలోని ఎల్కతుర్తి మండల కేంద్రంలో కారు (TS 03 FF 8094) డిక్కీలో గుర్తుతెలియని యువతి మృతదేహం లభ్యమైంది. ఎక్కడో చనిపోయిన యువతి బాడీని గుర్తు తెలియని దుండగులు కారులో తీసుకొచ్చి వదిలేసిపోయినట్టు తెలిసింది. ఘటనా స్థలంలో లభించిన ఆధార్ కార్డు ఆధారంగా కారులో దొరికిన మృతదేహం గోదావరిఖని సెంటినరీ కాలనీకి చెందిన ‘మానస’గా గుర్తించారు.
