ఏపీ

ఏపీలో దారుణం.. గొడవ పెట్టుకుందని యువతిపై కారు ఎక్కించి!

ఏపీలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఇద్దరు యువకులు ఓ యువతితో గొడవకు దిగారు. అనంతరం ఆమెను వెంబడించి మరీ కారుతో ఢీకొట్టి హతమార్చారు. ఈ ఘటన ఏపీలోని రాజమండ్రిలో చోటుచేసుకోగా గురువారం ఉదయం ఆలస్యంగా వెలుగుచూసింది.వివరాల్లోకివెళితే.. ఈ నెల 3వ తేదీన రాజమండ్రి ఏవీ అప్పారావు రోడ్డులోని ప్రసాదిత్యా మాల్‌కు సినిమా చూసేందుకు జీఎస్‌ఎల్ మెడికల్ కాలేజీ విద్యార్థిని ప్రియాంక (28) వెళ్లింది.అయితే, ప్రసాదిత్యా మాల్ పార్కింగ్ ప్రాంతంలో వాహనం నిలిపే క్రమంలో నామవరం ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులతో ఆమెకు స్వల్ప వాగ్వాదం నెలకొంది.