క్రైమ్

అమీర్‌పేటలో ఘోరప్రమాదం.. యువతి దుర్మరణం

హైదరాబాద్ మహానగరంలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతి మొబైల్ రిపేర్ కోసం వెళ్తుండగా.. బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్టు సమాచారం.ఆమె వెంట ఉన్న ర్యాపిడో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు అయినట్టు తెలుస్తోంది. వివరాల్లోకివెళితే..ఏపీలోని భీమవరానికి చెందిన హేమదుర్గ (26) బంజారాహిల్స్‌లోని ఓ కార్ల కంపెనీలో ఉద్యోగం చేస్తున్నది. ఆమె వినియోగిస్తున్న మొబైల్ పాడవడంతో రిపేర్ కోసం అమీర్ పేట వెళ్లేందుకు సిద్ధపడింది. ఈ క్రమంలోనే ర్యాపిడో బైక్ బుక్ చేసుకుని బయలు దేరింది. అయితే, అమీర్ పేట శ్రీనగర్ కాలనీ సమీపంలో బిగ్ బజార్ వెనుక గేటు వద్ద ర్యాపిడో బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టినట్టు సమాచారం.దీంతో ర్యాపిడో రైడర్‌తో పాటు వెనుక కూర్చున్న హేమదుర్గ ఇద్దరూ కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో రైడర్‌కు స్వల్ప గాయాలు అవ్వగా.. ఉద్యోగిని హేమదుర్గకు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందినట్టు సమాచారం.