National
Hormuz: హర్మూజ్‌లో భారత నౌకలకు ఇరాన్ స్పెషల్ పర్మిషన్!
Hormuz: ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హర్మూజ్ జలసంధిలో భారత వాణిజ్య నౌకలకు ఇరాన్ ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. అంతర్జాతీయంగా తీవ్ర ఉద్రిక్తతలు నడుస్తున్న వేళ.. తమ మిత్రదేశాల నౌకలపై ఉన్న ఆంక్షలను ఎత్తేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై భారత్‌తో పాటు చైనా, ఇరాక్, ఖతార్ దేశాలకు చెందిన వాణిజ్య నౌకలు ఎలాంటి అడ్డంకులు లేకుండా హర్మూజ్ జలసంధి గుండా స్వేచ్ఛగా రాకపోకలు సాగించవచ్చని తేల్చి చెప్పింది.ఈ నిర్ణయంపై ఇరాన్ విదేశాంగ విధాన కమిటీ డిప్యూటీ ఛైర్మన్ అమీర్ హయత్ మాట్లాడుతూ సంచలన విషయాలు వెల్లడించారు. "ప్రస్తుతం హర్మూజ్‌లో విధించిన రవాణా ఆంక్షల నుంచి భారత్, చైనా, ఇరాక్, ఖతార్లకు పూర్తి మినహాయింపు ఇచ్చాం. ఇకపై ఈ దేశాల నౌకలు జలసంధిలో ఫ్రీగా ప్రయాణించవచ్చు.
