క్రైమ్

Honey Trap: పాకిస్తాన్ మహిళ హనీట్రాప్‌లో ఎయిర్ ఫోర్స్ అధికారి.. డిఫెన్స్ సీక్రెట్స్ లీక్

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఒక ఆఫీసర్ పాకిస్తాన్ మహిళ హనీ ట్రాప్ లో చిక్కుకున్నారు. అంతేకాదు డిఫెన్స్ సీక్రెట్స్ సైతం ఆయన లీక్ చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. సదురు ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.