బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో హనీట్రాప్?
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారంల మద్రాస్ ఆర్మీ రెజిమెంట్‌లో భారీగా ఆయుధాలు మాయమైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆర్మీ అధికారుల ఫిర్యాదు మేరకు బొల్లారం పోలీసులు దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు పెద్దఎత్తున వెపన్స్, బుల్లెట్స్ మిస్ కావడంతో ఆర్మీ ఇంటెలిజెన్స్ సైతం రంగంలోకి దిగింది.ఈ మేరకు అధికారులు విచారణ చేపట్టగా.. ఇంతవరకు ఈ కేసులో ఎలాంటి పురోగతి కనిపించలేదు. అయితే, బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో కొత్త కోణం వెలుగుచూసినట్టు సమాచారం. ఆర్మీ ఆయుధాల చోరీ వెనుక హనీట్రాప్ ? జరిగి ఉండొచ్చని ఇంటెలిజెన్స్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆర్మీ సిబ్బందిని హనీట్రాప్‌లోకి దించి కీలక సమాచారం సేకరించారా? అనే కోణంలో విచారణ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. రెజిమెంట్‌లో పనిచేస్తున్న సిబ్బంది మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా ఖాతాలపై కేంద్ర నిఘా బృందం ఆరా తీస్తున్నట్టు తెలిసింది.
