తెలంగాణ
గూడు చెదిరే.. వృద్ధులను రోడ్డున పడేసిన ఇందిరమ్మ ఇళ్లు
ఇందిరమ్మ ఇళ్లు వస్తుందని ఆశించిన ఓ వృద్ధ జంటకు నిరాశే ఎదురైంది. ముందుగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యిందని చెప్పడంతో ఆశగా ఉన్న ఆ దంపతులు.. ప్రస్తుతం ఉంటున్న ఇంటిని కూల్చివేశారు. ఆ స్థలంలోనే కొత్త ఇంటిని నిర్మించుకోవాలని భావించారు.తీరా చూస్తే వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాలేదని అధికారులు చావు కబురు చల్లగా చెప్పారు.ఇంకేముంది ఉన్న ఇళ్లు పోయి.. ఇందిరమ్మ ఇళ్ల రాక ఈ వయస్సులో రోడ్డు మీద పడ్డారు. తమకు ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఈ ఘటన జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం ఇప్పగూడెంలో ఆలస్యంగా వెలుగుచూసింది.
