స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్
హెచ్ఎండీఏ.. ఏం మారలేదు ఎవరి వాటాలు వారివే?
అవినీతికి కేరాఫ్ అడ్రస్ హెచ్ఎండీఏ అని గత దశబ్దాలుగా ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్(ఎంఏయూడీ)కి ఇది గుండెకాయ లాంటిది. అలాంటి ముఖ్యమైన కార్యాలయాల్లో తెలంగాణ వచ్చినప్పటి నుంచి అధికారుల వాటాలు భారీగా పెరిగిపోయాయి అనడానికి అరవింద్ కుమార్‌పై ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలే నిదర్శనం. ప్రజెంట్ ఆ శాఖను రేవంత్ రెడ్డి తన వద్దే ఉంచుకున్నారు. కానీ అక్రమాలు ఎక్కడా తగ్గడం లేదు.
