తెలంగాణ
మళ్లీ బాదారు.. ఆర్టీసీ చార్జీలపై ప్రయాణికుల గగ్గోలు
పండుగలు వస్తున్నాయంటే చాలు ప్రయాణికులు హడలెత్తిపోతున్నారు. పండుగలు వచ్చిన ప్రతిసారి బస్సు చార్జీలు పెంచుతుండటంతో ప్యాసింజర్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మహిళలకు అంటే ఆధార్ కార్డులు ఉన్నాయని, మా పరిస్థితి ఏంటని పురుష ప్యాసింజర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్పెషల్ బస్సుల పేరిట అధిక చార్జీలు వసూలు చేయడంపై మండిపడుతున్నారు. తాజాగా హైదరాబాద్–హన్మకొండ ఏసీ బస్సు ఛార్జీని భారీగా పెంచినట్టు సమాచారం. ఆగస్టులో రూ.410గా ఉన్న టికెట్ ధర..సెప్టెంబర్లో ఏకంగా రూ.570 చేసినట్టు తెలుస్తోంది.ఒక్క ప్రయాణికుడిపై రూ.160 అదనపు భారం పడుతున్నట్టు తెలుస్తోంది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే ఛార్జీలు పెంచారంటూ ప్రయాణికలు ఆరోపిస్తున్నారు. పండుగల పేరుతో ప్రయాణికులపై ఆర్టీసీ భారం మోపుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
