హిజాబ్‌పై తీర్పు.. న్యాయమూర్తులపై ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
పాఠశాలలో హిజాబ్ ధరించి వచ్చేందుకు అనుమతి ఇవ్వడంతో పాటు స్కూల్ యాజమాన్యాన్ని ఆదేశించాలని కోరుతూ ఓ విద్యార్థిని దాఖలు చేసిన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. హిజాద్ అనేది ఇస్లాంలో తప్పనిసరి కాదని, ఈ మేరకు సరైన ఆధారాలు కూడా లేవని కోర్టు అభిప్రాయపడింది. విద్యాసంస్థల్లో యూనిఫామ్ అనేది పాటించాలని పేర్కొంది. ఈ క్రమంలోనే ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సైతం అలహాబాద్ హైకోర్టు తీర్పును తప్పుబట్టారు. తాజాగా ఆయన నగరంలోని ఓ ఈవెంటులో మాట్లాడుతూ.. హిజాబ్ వివాదంపై కోర్టు తీర్పుపై స్పందించారు. స్కూల్లో హిజాబ్ ధరించేందుకు అనుమతి నిరాకరిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఖండించారు.ఈ తీర్పును ఇస్లాంపై దాడిగా అభివర్ణించారు. ‘ఇది మా మతం, ఏది అవసరమో మేమే నిర్ణయించుకుంటాం. నిర్ణయించడానికి న్యాయమూర్తులు ఎవరు?’ అంటూ ఫైర్ అయ్యారు. ఇస్లాంకు ఏది ముఖ్యమో, ఏది కాదో నిర్ణయించడం న్యాయమూర్తుల పని కాదన్నారు.
