National
ఇస్లాంలో హిజాబ్ తప్పనిసరికాదు : అలహాబాద్ హైకోర్టు
హిజాబ్ సంస్కృతి అనేది పాఠశాలల్లో వర్తింపజేయాలని ఓ విద్యార్థిని దాఖలు చేసిన పిటిషన్‌పై అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. పాఠశాలలో తాను యూనిఫామ్‌తో పాటు తలకు హిజాబ్ ధరించేందుకు అనుమతి ఇవ్వాలని, ఈ మేరకు పాఠశాలకు ఆదేశాలివ్వాలని సదరు విద్యార్థిని దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. ఇస్లాంలో హిజాబ్ ధరించడం అత్యవసరమైన మతపరమైన ఆచారమని నిరూపించేందుకు వాస్తవ, చట్టపరమైన ఆధారాలను లేవని స్పష్టంచేసింది. ఈ ఘటన యూపీ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్‌లో వెలుగుచూసింది. ప్రయాగ్ రాజ్‌లో అత్తర్ సూయియా ప్రాంతంలో ఠాగూర్ పబ్లిక్ స్కూల్ ఉంది. అందులో చదివే ఓ విద్యార్థిని సుకైనా రిజ్వీ.. తన తల్లి ద్వారా ఈ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు దానిని కొట్టివేసింది.
