ఏపీ

పులివెందులలో హైటెన్షన్.. వైసీపీ, టీడీపీ నేతల హోరాహోరీ దాడులు

ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. అయితే, పలు పోలింగ్ కేంద్రాల వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు వైసీపీ గూండాలు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకోగా స్థానికులు, తెలుగుదేశం పార్టీ నేతల మధ్య దాడులు చోటుచేసుకున్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద కర్రలు, రాళ్లతో పాటు పెట్రోల్ బాంబు దాడులు జరిగినట్టు సమాచారం. తిరుపతి జిల్లా పెనగలూరు మండలం నల్లపురెడ్డిపల్లెలో బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసుల కళ్లెదురు గానే కొందరు పెట్రోల్ బాంబులతో దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కడప జిల్లా పులివెందుల మండలం ఎర్రిపల్లి పోలింగ్ బూత్ వద్ద కూడా పెట్రోల్ బాంబులు విసరడంతో భారీగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.