తెలంగాణ

ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి చీర లాగిన పోలీసులు

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అధికార కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలని నిరసిస్తూ గన్‌పార్క్ వద్ద ప్లకార్డులు ప్రదర్శించి అసెంబ్లీకి పాదయాత్ర చేస్తూ వచ్చిన బీఆర్ఎస్ శాసన సభ్యులను పోలీసుల అడ్డుకున్నారు. వారిని లోనికి వెళ్లేందుకు అనుమతించలేదు. నల్లదుస్తులు ధరించి రాకూడదని చెప్పడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ శాసనసభ సభ్యులను పోలీసులు అడ్డుకోవడానికి యత్నించారు. ఈ క్రమంలోనే ఓ పోలీసు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి చీర లాగి అవమానించినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల దౌర్జన్యం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు.