తెలంగాణ
బీఆర్ఎస్ నేతల భూఅక్రమాలపై విచారణకు హైపవర్ కమిటీ.. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ!
తెలంగాణలోని పలు జిల్లాల్లో గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ కేటాయింపులు, కొనుగోళ్లు, తీవ్ర అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, గంగుల కమలాకర్, జగదీశ్‌రెడ్డి, పలువురు బీఆర్ఎస్ నాయకులు, వారి కుటుంబ సభ్యులు, అనుచరులకు చెందిన భూములపై వచ్చిన ఆరోపణలను క్షుణ్ణంగా పరిశీలించేందుకు ప్రభుత్వం ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ అధికారికంగా జీవోను జారీ చేసింది. ఈ కమిటీకి ఐఏఎస్ అధికారిణి ఏ.శ్రీదేవసేన అధ్యక్షత వహించనుండగా, రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజీవ్‌గాంధీ హనుమంతు(IAS) కన్వీనర్‌గా, జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా(IAS) సభ్యుడిగా వ్యవహరిస్తారు
