ఏపీ
హైకోర్టు వార్నింగ్.. ఇన్ స్టా మిస్డ్‌కాల్‌తో దొరికిన బాలిక ఆచూకీ!
జూన్ 9వ తేదీన కనిపించకుండా పోయిన బాలికను ఎట్టకేలకు ఏపీ పోలీసులు కనిపెట్టారు. తన కూతురు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసి మూడు నెలలు గడిచిందని అయినా ఆచూకీ కనిపెట్టలేకపోయారని బాలిక తండ్రి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీంతో ఆగ్రహించిన కోర్టు.. గుంటూరు జిల్లా పోలీసుల పనితీరుపై మండిపడింది. తెల్లవారే సరికి బాలికను న్యాయస్థానం ముందు హాజరు పరచాలని ఆదేశాలు ఇవ్వడంతో .. బాలిక ఆచూకీని కనిపెట్టేందుకు ప్రత్యేకంగా ‘సిట్’ వేసిన ఏపీ డీజీపీ.. విచారణ చేపట్టగా.. హర్యానాలో బాలిక ఆచూకీని గుర్తించారు. ఇన్‌స్టా మిస్డ్‌కాల్ ద్వారా గుంటూరులో కనిపించకుండా పోయిన బాలిక కేసును పోలీసులు చేధించినట్టు తెలిసింది. బాలిక మిస్సింగ్ కేసులో షేక్ జాన్‌సైదాను నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు.
