తెలంగాణ

కొండా సురేఖ విషయంలో అధిష్టానం యూటర్న్?

సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ తగిలినట్టు తెలుస్తోంది. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించే విషయంలో అధిష్టానం యూటర్న్? తీసుకున్నట్టు సమాచారం. కొండా సురేఖకు ఇద్దరు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, ఇద్దరు మంత్రులు, ఒక అగ్రనేత మద్దతు పలికినట్టు తెలుస్తోంది. ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకున్నా జాగ్రత్తగా వ్యవహరించాలని అధిష్టానాన్ని రాష్ట్ర కీలక నేతలు కోరినట్టు తెలిసింది. మంత్రి కొండా సురేఖపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని మరో ఏఐసీసీ కార్యదర్శి అధిష్టానానికి సూచించినట్టు సమాచారం. ఆమెను కేబినెట్ నుంచి తొలగిస్తే తీవ్ర రాజకీయ పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన ముందస్తు హెచ్చరిక చేసినట్టు తెలుస్తోంది. ఒకవేళ సురేఖను మంత్రి పదవి నుంచి తొలగిస్తే ఆమె పార్టీకి రాజీనామా చేసే అవకాశం ఉందని, దానివల్ల ఉపఎన్నిక అనివార్యమై రాష్ట్రంలో పార్టీపై ప్రతికూల ప్రభావం పడుతుందని కీలక నేతలు అధిష్టానానికి సూచించినట్టు సమాచారం.