తెలంగాణ
బొల్లారంలో హైఅలర్ట్.. ఆర్మీ బేస్ వద్ద భారీగా పేలుడు పదార్థాలు
హైదరాబాద్ మహానగరంలో భారీ పెనుప్రమాదం తప్పినట్టు తెలుస్తోంది. బొల్లారం పరిధిలో పెద్దమొత్తంలో పేలుడు పదార్థాలు కలకలం రేపాయి. బొల్లారం పీఎస్ పరిధిలోని మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్ సమీపంలో గల ఫైరింగ్ రేంజ్ వద్ద గుర్తుతెలియని వ్యక్తులు ఓ బకెట్లో 160కు పైగా డిటోనేటర్లు పెట్టగా అధికారులు వాటిని గుర్తించినట్టు తెలిసింది. వెంటనే బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్, స్థానిక పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని తనిఖీలు చేపట్టినట్టు సమాచారం. బకెట్‌ను క్షుణ్ణంగా పరిశీలించిన బాంబ్ స్క్వాడ్.. ఒక్కో బండిల్లో 20 చొప్పున మొత్తం 8 బండిళ్లలో భద్రపరిచిన డిటోనేటర్లను స్వాధీనం చేసుకుని.. దూరంగా తీసుకెళ్లి నిర్వీర్యం చేసే ప్రక్రియ ప్రారంభించిట్టు సమాచారం.
