టాప్ న్యూస్

రాజకీయాల్లోకి హీరో ధనుష్.. త్వరలో కొత్త పార్టీ ప్రకటన!

తమిళనాడు రాజకీయాల్లో మరో సంచలనం చోటుచేసుకోనుందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఆ రాష్ట్ర రాజకీయాలను సినీరంగం నుంచి వచ్చిన వారే చక్రం తిప్పుతున్నారు. తమిళ ప్రజలు సైతం తమ అభిమాన నటీనటులకే అగ్రతాంబూలం ఇచ్చారు. కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత, మొన్న వచ్చిన జోసెఫ్ విజయ్ వరకు వీరంతా సినిమాల్లో ఓ వెలుగువెలికి రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. , తాజాగా రాజకీయ రంగప్రవేశానికి నటుడు ధనుష్ సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతోంది. ‘తమిళగ ఎళుచ్చి కళగం’ (తమిళనాడు పురోగమన పార్టీ) పేరుతో కొత్త పార్టీని ప్రారంభించనున్నారని తెలుస్తోంది.ఇప్పటికే ధనుష్ తన పార్టీ పేరును భారత ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ చేయించినట్లు తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీనిపై త్వరలోనే ధనుష్ అధికారికంగా ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని సన్నిహితులు చెబుతున్నారు.