తెలంగాణ

హీలియం గ్యాస్ కలకలం.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనుమానాస్పద మృతి

హైదరాబాద్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతని పక్కనే హీలియం గ్యాస్ సిలిండర్, సూసైడ్ నోట్ లభ్యం అయినట్టు సమాచారం. హరియాణాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సౌరభ్ శేఖర్ (36) గత కొంతకాలంగా హైదరాబాద్‌లో జాబ్ చేస్తూ రాయదుర్గం పరిధిలో తన సోదరుడితో కలిసి నివాసం ఉంటున్నాడు.ఈ క్రమంలోనే స్నేహితుడిని కలిసేందుకు వెళ్తున్నానని శనివారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన సౌరభ్.. కొండాపూర్ రాఘవేంద్ర కాలనీలోని వీవీ హైట్స్ సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో ఉన్నట్లు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు.ఆదివారం ఉదయం వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆ ఫ్లాట్‌ అడ్రస్‌కు అతని సోదరుడు వెళ్లాడు. తలుపులు పగలగొట్టి చూడగా సౌరభ్ విగతజీవిగా కనిపించాడు. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.