తెలంగాణ
రాష్ట్రంలో భారీ వర్షాలు
రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్ సహా మొత్తం 6 జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తెలంగాణలో మరో 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.హైదరాబాద్‌లోనూ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మేడ్చల్, నల్గొండ, రంగారెడ్డిలో మోస్తరు వర్షాలు కురుస్తాయని.. సంగారెడ్డి, యాదాద్రి భువనగిరిలో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. వర్షం కురిసే సమయంలో గంటకు 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.అత్యవసరం అయితే తప్పా ప్రజలు ఎవరూ బయటకు రాకూడదని వెల్లడించింది.
