Health
Health: అరికాళ్లలో మంటలు ఎందుకు వస్తాయి?..
అరికాళ్లు వేడిగా ఉన్నట్టుగా, మంటగా, సూదులతో గుచ్చినట్టుగా లేదా చీమలు పాకుతున్నట్టుగా అనిపించడం చాలామందిలో కనిపించే సమస్య. ముఖ్యంగా రాత్రి పడుకున్నప్పుడు ఈ మంట మరింత ఎక్కువై నిద్రకు కూడా ఇబ్బంది కలిగించవచ్చు. అయితే అరికాళ్లలో తరచూ మంట రావడం శరీరంలో జరుగుతున్న కొన్ని మార్పులకు సంకేతంగా ఉండొచ్చు.
అరికాళ్లలో మంటకు ప్రధాన కారణాల్లో ఒకటి పెరిఫెరల్ న్యూరోపతి, అంటే శరీరంలోని అంచు నరాలు దెబ్బతినడం. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువకాలం నియంత్రణలో లేకపోతే పాదాలు, కాళ్లలోని నరాలు దెబ్బతిని మంట, తిమ్మిరి, నొప్పి లేదా స్పర్శ తగ్గడం వంటి లక్షణాలు కనిపించవచ్చు.అరికాళ్లలో మంట కొన్ని వారాలుగా కొనసాగుతున్నా, తీవ్రత పెరుగుతున్నా, కాళ్లపైకి మంట వ్యాపిస్తున్నా లేదా పాదాల్లో స్పర్శ తగ్గుతున్నా వైద్యుడిని సంప్రదించడం మంచిది
