Health

ఆకలి వేసినప్పుడు కడుపులో శబ్ధాలు ఎందుకు వస్తాయి?..

ఆకలి వేసినప్పుడు కడుపులో గుడుగుడు, గురుగురు అంటూ శబ్ధాలు రావడం చాలా సాధారణం. చాలామందికి ఇవి ఆకలికి సంకేతంగా భావిస్తారు. అయితే ఈ శబ్ధాలు కేవలం కడుపు ఖాళీగా ఉండటం వల్ల మాత్రమే రావు. జీర్ణవ్యవస్థలో జరిగే సహజ కదలికలే దీనికి ప్రధాన కారణం అని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. మన కడుపు, పేగుల్లో ఆహారం లేకపోయినా జీర్ణవ్యవస్థ పూర్తిగా నిశ్చలంగా ఉండదు. కొంత సమయం గడిచిన తర్వాత కడుపు, చిన్నపేగుల్లో కండరాలు తరంగాల్లా కుదుస్తూ, లోపల ఉన్న ద్రవాలు, గాలి, జీర్ణరసాలను ముందుకు కదిలిస్తాయి. దీనినే వైద్యపరంగా మైగ్రేటింగ్ మోటార్ కాంప్లెక్స్ అంటారు. ఈ కదలికల సమయంలో గాలి, ద్రవాలు పేగుల్లో కదలడంతో గుడుగుడు శబ్ధాలు వినిపిస్తాయి.