Health

మెదడు చురుగ్గా పనిచేయాలంటే ఏం చేయాలి?..

మన శరీరాన్ని నడిపించే అత్యంత కీలకమైన అవయవాల్లో మెదడు ఒకటి. ఆలోచించడం, జ్ఞాపకశక్తి, నిర్ణయాలు తీసుకోవడం, శరీర కదలికలను నియంత్రించడం వంటి ఎన్నో ముఖ్యమైన పనులు మెదడు ద్వారానే జరుగుతాయి. అందుకే మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరికీ అవసరం.. ముందుగా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. ధ్యానం, యోగా, ప్రాణాయామం వంటి పద్ధతులు విశ్రాంతికి, ఒత్తిడి నియంత్రణకు సహాయపడతాయి. అదే సమయంలో అధిక రక్తపోటు, రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ వంటి అంశాలను అదుపులో ఉంచుకోవడం కూడా మెదడు ఆరోగ్యానికి ముఖ్యమే. అవసరమైతే వైద్యుల సూచనలతో చికిత్స తీసుకోవాలి. క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం చేయడం వల్ల శరీరానికి రక్త ప్రసరణ మెరుగుపడటమే కాకుండా, మెదడు ఆరోగ్యానికి కూడా ప్రయోజనం కలుగుతుంది.