Health
Health: పంచ కర్మ చికిత్స అంటే ఏమిటి ? ఇది ఆరోగ్యానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది..
ఆయుర్వేదంలో పంచకర్మ చికిత్సకు ప్రత్యేక స్థానం ఉంది. శరీరంలో పేరుకుపోయిన దోషాలను తగ్గించి, జీర్ణక్రియతో పాటు శరీర పనితీరును సమతుల్యం చేయడం దీని ప్రధాన ఉద్దేశంగా ఆయుర్వేదం చెబుతుంది. అయితే పంచకర్మ అంటే అందరికీ ఒకే విధంగా చేసే చికిత్స కాదు. వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని బట్టి నిర్ణయిస్తారు.
పంచకర్మలో ప్రధానంగా ఐదు శుద్ధి విధానాలను ప్రస్తావిస్తారు. వమనంలో వైద్య పర్యవేక్షణలో వాంతి చేయించడం, విరేచనంలో మందుల ద్వారా విరేచనం కలిగించడం, బస్తిలో ఔషధ ద్రవాలను ప్రత్యేక విధానంలో ఉపయోగించడం, నస్యలో ముక్కు ద్వారా ఔషధాలను అందించడం, రక్తమోక్షణంలో నియంత్రిత పద్ధతిలో రక్తాన్ని తొలగించడం వంటి విధానాలు ఇందులో ఉంటాయి.
