Health

హార్ట్ ఎటాక్ ఎందుకు వస్తుంది? ముందుగా కనిపించే లక్షణాలు ఏంటి?

మారుతున్న నేటి జీవనశైలిలో 'హార్ట్ ఎటాక్' వయస్సుతో సంబంధం లేకుండా అందరినీ భయపెడుతోంది. ఒకప్పుడు పెద్దవారికే పరిమితం అనుకున్న ఈ ప్రమాదం వల్ల ప్రస్తుతం రోజురోజుకూ మరణాల సంఖ్య పెరుగుతోంది.. తీరిక లేని పరుగెత్తే జీవితం, మితిమీరిన మానసిక ఒత్తిడి, సరిగ్గా నిద్రలేని రాత్రులు... వీటితో పాటు జంక్ ఫుడ్ సంస్కృతి మన గుండె ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.