Health
గుండెలో దడ రావడానికి కారణాలు ఏమిటి?..
గుండెలో ఒక్కసారిగా దడ రావడం.. వేగంగా కొట్టుకుంటున్నట్టు అనిపించడం.. మధ్యలో బీట్ మిస్ అయినట్టుగా లేదా గుండె ఫ్లట్టర్ అవుతున్నట్టుగా అనిపించడం చాలామందికి ఎదురయ్యే సమస్య. వైద్య పరిభాషలో దీన్ని హార్ట్ పాల్పిటేషన్స్ అంటారు. ఇది తరచూ వస్తుంటే కారణాన్ని గుర్తించడం అవసరమని నిపుణులు అంటున్నారు.
ఇక ఆరోగ్య నిపుణుల ప్రకారం గుండెలో దడకు మొదటి కారణాల్లో ఒత్తిడి, ఆందోళన, భయం, పానిక్ వంటి భావోద్వేగ పరిస్థితులు ఉంటాయి. నిద్ర సరిగా లేకపోవడం, అధికంగా వ్యాయామం చేయడం, శరీరంలో నీరు తగ్గడం కూడా గుండె వేగాన్ని పెంచవచ్చు. కెఫీన్, నికోటిన్, ఆల్కహాల్, ఎనర్జీ డ్రింక్స్ వంటి పదార్థాలు కొందరిలో పాల్పిటేషన్స్ను ప్రేరేపించవచ్చు. కొన్ని జలుబు మందులు, ఆస్తమా లేదా ఇతర మందులు కూడా కారణం కావచ్చని పేర్కొంటున్నారు.
