Health
Health: హార్ట్ ఎటాక్ ముప్పు తగ్గాలంటే.. డైట్లో ఇవి తప్పనిసరి!..
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే మందులకంటే ముందుగా మన రోజువారీ ఆహార అలవాట్లు, జీవనశైలిపై దృష్టి పెట్టాలి. గుండె కేవలం రక్తాన్ని పంప్ చేసే అవయవం మాత్రమే కాదు.. శరీరంలోని ప్రతి భాగానికి ఆక్సిజన్ అందించే కీలకమైన అవయవం. అందుకే గుండెను కాపాడుకోవడం అంటే మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే.
చిన్న వయసులోనే గుండె జబ్బులు కనిపించడానికి అధిక బరువు, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ధూమపానం, శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారం వంటి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రాసెస్డ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, అధిక ఉప్పు, చక్కెర, సంతృప్త కొవ్వులు ఎక్కువగా తీసుకోవడం గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
