Health
జలుబు-దగ్గు ఉందా.. వీటికి దూరంగా ఉండాల్సిందే!..
దగ్గు, జలుబు ఉన్నప్పుడు ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. చల్లటి నీరు, ఐస్‌క్రీమ్‌లు, చల్లని పానీయాలతో పాటు ఎక్కువ చక్కెర, సోడాలు, సమోసాలు, బజ్జీలు, జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి గొంతు చికాకును పెంచే అవకాశం ఉంది. పాలు కఫాన్ని కొత్తగా పెంచవు కానీ గొంతులో శ్లేష్మం చిక్కబడేలా చేయొచ్చు. తీవ్ర గొంతు నొప్పి ఉంటే పుల్లటి పండ్లను తగ్గించడం మంచిది. కాఫీ, టీకి బదులుగా గోరువెచ్చని నీరు, అల్లం టీ, వేడి సూప్‌లు తీసుకుంటూ తగినంత విశ్రాంతి తీసుకుంటే త్వరగా కోలుకోవచ్చని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు..
