Health
Health:జ్వరం వచ్చినప్పుడు ఈ తప్పులు మాత్రం చేయకండి!!..
జ్వరం వచ్చిన వెంటనే చాలామందికి వచ్చే సందేహాలు రెండే.. అన్నం తినవచ్చా? స్నానం చేయవచ్చా? ఈ రెండింటిపై ఎన్నో అపోహలు ఉన్నాయి. కానీ వైద్య నిపుణులు చెబుతున్న విషయాలను పరిశీలిస్తే.. జ్వరం వచ్చినప్పుడు ఆహారం, నీరు, పరిశుభ్రత విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే శరీరం కోలుకోవడానికి సహాయపడుతుంది.సాధారణంగా శరీర ఉష్ణోగ్రత 100.4 డిగ్రీల ఫారెన్హీట్.. అంటే 38 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని జ్వరంగా పరిగణిస్తారు. జ్వరంతో పాటు నీరసం, చలి, తలనొప్పి, చెమటలు వంటి లక్షణాలు కనిపించవచ్చు. అయితే జ్వరం అనేది శరీరంలో జరుగుతున్న మార్పునకు సంకేతం అంటారు..
