Health

కళ్లు మసకబారుతున్నాయా? అయితే ఈ సమస్య కావచ్చు!..

కళ్లు మసకగా కనిపించడం చాలామంది సాధారణ సమస్యగానే భావిస్తారు. కానీ తరచూ ఇలా జరుగుతుంటే నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు సూచిస్తున్నారు. కంటి చూపు పవర్ మారడం వల్ల దూరం లేదా దగ్గరలోని వస్తువులు స్పష్టంగా కనిపించకపోవచ్చు.. అలాగే వయసు పెరిగే కొద్దీ వచ్చే ప్రెస్బయోపియా వల్ల కూడా దగ్గర చూపు మసకబారవచ్చు. అలాగే కంప్యూటర్, మొబైల్ వంటి డిజిటల్ స్క్రీన్లను ఎక్కువసేపు చూడటం వల్ల కళ్లపై ఒత్తిడి పెరిగి డ్రై ఐ, కంటి మంట, అలసట, తాత్కాలికంగా మసక చూపు రావచ్చు. స్క్రీన్ చూస్తున్నప్పుడు రెప్పలు తక్కువగా కొట్టడం కూడా కంటి పొడిబారడానికి కారణమవుతుంది. మరో ముఖ్యమైన కారణం డయాబెటిస్. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు కంటి లెన్స్‌లో ద్రవ మార్పులు జరిగి తాత్కాలికంగా చూపు మసకబారవచ్చు.