Health

Health: వెల్లుల్లి ఆరోగ్యానికి వరమా?.. నిపుణులు ఏం చెబుతున్నారు?..

వంటింట్లో నిత్యం ఉపయోగించే వెల్లుల్లికి ఆయుర్వేదంలో ప్రత్యేక స్థానం ఉంది. ఆధునిక పరిశోధనలు కూడా వెల్లుల్లిలోని కొన్ని సహజ సమ్మేళనాలు శరీరంలోని కొలెస్ట్రాల్, రక్తపోటు, రక్తంలో చక్కెర వంటి అంశాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని సూచిస్తున్నాయి. అయితే ఈ ప్రయోజనం పొందాలంటే వెల్లుల్లిని ఎలా తీసుకుంటున్నామన్నది కూడా ముఖ్యమే అని అంటున్నారు ఆరోగ్యనిపుణులు..

వెల్లుల్లిలో అల్లిసిన్ అనే ముఖ్యమైన బయోయాక్టివ్ సమ్మేళనం ఉంటుంది. వెల్లుల్లి రెబ్బను కోసినప్పుడు లేదా నలిపినప్పుడు దీనికి సంబంధించిన రసాయన చర్యలు ప్రారంభమవుతాయి. అందుకే నలిపిన లేదా మెత్తగా చేసిన వెల్లుల్లిని కొద్దిసేపు ఉంచి వంటలో ఉపయోగించడం వల్ల కొన్ని క్రియాశీల సమ్మేళనాలు ఏర్పడే అవకాశం ఉంటుంది.