Health
మైండ్ ప్రశాంతంగా ఉండాలంటే.. ఈ యోగా పద్ధతి ట్రై చేయండి!..
ప్రస్తుత జీవనశైలిలో ఒత్తిడి, ఆందోళన, మానసిక అలసట వంటి సమస్యలు చాలామందిని వేధిస్తున్నాయి. పని ఒత్తిడి, వ్యక్తిగత సమస్యలు, నిద్రలేమి, నిరంతరం ఆలోచించడం వంటి కారణాలతో మనసుపై భారం పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో యోగా, ధ్యానం, శ్వాసాభ్యాసాలు వంటి పద్ధతులు ఒత్తిడిని నియంత్రించుకోవడంలో కొంతమందికి ఉపయోగపడవచ్చు. అయితే తీవ్రమైన మానసిక సమస్యలు ఉన్నప్పుడు వైద్య నిపుణుల సలహా తీసుకోవడం చాలా ముఖ్యం.
ఇలాంటి యోగా పద్ధతుల్లో అర్హటిక్ యోగాకు కూడా ప్రత్యేక స్థానం ఉందని వరల్డ్ ప్రాణిక్ హీలింగ్, ఇండియా డైరెక్టర్ శ్రీరామ్ రాజగోపాల్ తెలిపారు. గ్రాండ్ మాస్టర్ చోవా కోక్ సుయ్ అభివృద్ధి చేసిన అర్హటిక్ యోగా.. మానసిక స్పష్టత, ఏకాగ్రత, భావోద్వేగ సమతుల్యతను పెంపొందించడమే లక్ష్యంగా రూపొందించబడిందని ఆయన వివరించారు.
