Health

Health: దిండు కింద ఫోన్ పెట్టుకుని నిద్రిస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసుకోండి! ..

నిద్రించే సమయంలో ఫోన్‌ను దిండు కింద పెట్టుకోవడం చాలామందికి అలవాటుగా మారింది. అలారం కోసం కావొచ్చు.. వెంటనే నోటిఫికేషన్లు చూసేందుకు కావొచ్చు.. ఫోన్‌ను మాత్రం తలకు అతి దగ్గరగా పెట్టుకుని నిద్రించే పద్ధతి మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు.

ముఖ్యంగా ఫోన్‌ను దిండు కింద పెట్టుకుని ఛార్జింగ్ చేయడం మరింత ప్రమాదకరం. దిండు, దుప్పటి వంటి వస్తువులు ఫోన్ చుట్టూ వేడిని బయటకు వెళ్లకుండా అడ్డుకుంటాయి. దీంతో పరికరం అధికంగా వేడెక్కే అవకాశం ఉంటుంది. బ్యాటరీ దెబ్బతినడంతో పాటు, అరుదైన సందర్భాల్లో బ్యాటరీలో సమస్యలు తలెత్తి అగ్ని ప్రమాదానికి కూడా దారితీయవచ్చు. అందుకే ఛార్జింగ్‌లో ఉన్న ఫోన్‌ను ఎప్పుడూ దిండు కింద లేదా మంచం మీద పెట్టకూడదని అంటున్నారు.