Health

Health: పెయిన్ కిల్లర్, యాంటీబయాటిక్‌.. ఇష్టం వచ్చినట్లు వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి!..

తలనొప్పి వచ్చింది.. ఒళ్లు నొప్పిగా ఉందని తరచుగా పెయిన్ కిల్లర్ వేసుకోవడం. జలుబు, గొంతునొప్పి వచ్చిందంటే డాక్టర్‌ను సంప్రదించకుండానే యాంటీబయాటిక్ మొదలుపెట్టడం. చాలమందిలో సాధారణంగా కనిపించే ఈ అలవాట్లపై కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ CDSCO హెచ్చరిక జారీ చేసింది. పెయిన్ కిల్లర్లు, ముఖ్యంగా NSAIDsను అవసరం లేకుండా పదేపదే లేదా ఎక్కువకాలం తీసుకోవడం ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందని CDSCO స్పష్టం చేసింది. ఈ మందుల్లో కొన్ని కిడ్నీలకు వెళ్లే రక్తప్రవాహాన్ని తగ్గించగలవు. దీంతో కిడ్నీల పనితీరుపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కిడ్నీ సమస్యలు ఉన్నవారు, డీహైడ్రేషన్‌తో ఉన్నవారు, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు లేదా కిడ్నీలను ప్రభావితం చేసే ఇతర మందులు వాడుతున్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించింది.