Health
Health: షుగర్ కంట్రోల్‌కు అద్భుతమైన ఔషదం.. ఇది ఎంతవరకు పనిచేస్తుందంటే?..
డయాబెటిస్ అనేది నేటి కాలంలో సాధారణంగా మారింది. ఒత్తిడితో కూడిన లైఫ్, నియంత్రణలో లేని అలవాట్ల వల్ల రోజు రోజుకు డయాబెటిస్ పేషెంట్స్ పెరుగుతున్నారు. అయితే షుగర్ వ్యాధిని కంట్రోల్ ల్లో ఉంచడానికి ఆరోగ్యనిపుణులు మనింట్లోని వంటింట్లో దొరికే వస్తువుల గురించి చెప్పడం తెలిసిందే.. అలాంటి వాటిలో కసూరి మేతి ఒకటి. ఇక రోజువారీ వంటల్లో రుచి, సువాసన కోసం ఉపయోగించే కసూరి మేతి.. అంటే ఎండిన మెంతి ఆకులు. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కొంతమేర సహాయపడే అవకాశం ఉందని పరిశోధనలు సూచిస్తున్నాయి. మెంతిలో ఫైబర్‌తో పాటు కొన్ని బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. ముఖ్యంగా ఫైబర్ జీర్ణక్రియను నెమ్మదించడం ద్వారా భోజనం తర్వాత రక్తంలో గ్లూకోజ్ ఒక్కసారిగా పెరగకుండా కొంతమేర సహాయపడవచ్చు.
