International
డెమోక్రాట్లు గెలిస్తే జైలుకు వెళ్తావు: జర్నలిస్ట్‌కు మస్క్ కౌంటర్!
టెస్లా, స్పేస్ఎక్స్, ఎక్స్(X) అధినేత ఎలాన్ మస్క్(Elon Musk) సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయ, టెక్ వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి. రాబోయే 2026 అమెరికా మధ్యంతర ఎన్నికల్లో(US Midterms 2026) డెమోక్రాట్లు విజయం సాధించి కాంగ్రెస్‌ని చేజిక్కించుకుంటే మస్క్ జైలుకు వెళ్లాల్సి రావచ్చు అంటూ ప్రముఖ టెక్ జర్నలిస్ట్ కారా స్విషర్ చేసిన తీవ్ర వ్యాఖ్యలపై ఆయన విరుచుకుపడ్డారు. కేవలం రెండే రెండు పదాల్లో ‘మెసేజ్ అందింది’ (Message received) అంటూ మొదట స్పందించిన మస్క్, ఆ తర్వాత మరింత ఘాటైన పోస్ట్ ద్వారా కౌంటర్ ఇచ్చారు.
