తెలంగాణ
నాపై అత్యాచారం చేశాడు.. ఏలూరు యువకుడిపై యువతి ఫిర్యాదు
ఏపీకి చెందిన యువకుడిపై హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో అత్యాచారం కేసు నమోదైంది. తనపై అత్యాచారం చేయడంతో పాటు అశ్లీల వీడియాలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకివెళితే.. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం పొంగుటూరు గ్రామానికి చెందిన పాస్టర్ మల్లిపూడి సువర్ణ రాజు కుమారుడిపై ఓ యువతి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అత్యాచారంతో పాటు బ్లాక్ మెయిల్ కేసు కూడా పెట్టింది.కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడి తండ్రి మల్లిపూడి సువర్ణ రాజును గచ్చిబౌలి పోలీసులు ఆయన స్వగ్రామంలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
