క్రైమ్

ప్రియుడిని నమ్మివెళ్లినందుకు ముక్కలుగా నరికాడు

ప్రేమ, వివాహేతర సంబంధం మోజులో పడి కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని కొందరు భర్తలు, అత్తమామలు,పేగు తెంచుకుని పుట్టిన పిల్లలను కడతేరుస్తుంటే.. మరికొందరు తమ కోసం వచ్చిన ప్రియురాలినే అంతం చేస్తున్నారు.తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి ఆలస్యంగా వెలుగుచూసింది. పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసినందుకు గాను ఓ వ్యక్తి ప్రియురాలిని ముక్కలు ముక్కలుగా నరికి మృతదేహాన్ని కనిపించకుండా చేశాడు. వివరాల్లోకివెళితే.. హనుమకొండ జిల్లా హసన్‌పర్తికి చెందిన స్వప్న(40) భర్త చనిపోవడంతో తల్లిదండ్రుల వద్దే ఉంటోంది.గతంలో తల్లిదండ్రులతో కలిసి పూజ కోసం బళ్లారికి వెళ్లినప్పుడు అక్కడ ఆమెకు డ్రైవర్ బసవరాజ్‌తో పరిచయం ఏర్పడింది.అది కాస్త వివాహేతర బంధానికి దారితీయగా పెళ్లి చేసుకోవాలని బసవరాజ్‌ను కోరిన స్వప్న కోరింది. అతను ఒప్పుకోకపోవడంతో స్వప్న బ్లాక్ మెయిల్ చేయగా.. ఆమెను హత్య చేసి ముక్కలుగా నరికినట్టు సమాచారం.