తెలంగాణ
HCA : ఉప్పల్ వేదికగా హెచ్‌సీఏ బాగోతం.. మళ్లీ పాత దందాయేనా?
హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు ఇంటర్నేషనల్ మ్యాచ్ అంటే ఒక పండుగ. రెండేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ జరగబోతోంది. స్థానిక కుర్రాళ్లు తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డితో పాటు ఎస్‌ఆర్‌హెచ్ స్టార్లు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ లాంటి హిట్టర్లను ప్రత్యక్షంగా చూసేందుకు అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశారు. కానీ మ్యాచ్ ఆరంభానికి ముందే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) తీరు పాత కథనే గుర్తుచేస్తోంది. పారదర్శకత లేని విధానాలతో, ఎవరికీ తెలియని సరికొత్త యాప్‌ను తెరపైకి తెచ్చి క్రికెట్ ఫ్యాన్స్‌ను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.
